ADDAMLO MANAM

మనలో మనం

తరతరాలుగా రెడ్లు పాలనా వర్గాల్లో ఉన్న మాట వాస్తవం అయినప్పటికీ…. అందరూ రెడ్లు ఆ స్థాయిలో లేరు అనేది కూడా వాస్తవం. రెడ్లల్లో 5% కుటుంబాలు వ్యాపార రాజకీయ రంగాల్లో అగ్రగణ్యులుగా రాణిస్తున్నారు.

 

4% ఉన్నత కుటుంబాలుగా ఉన్నారు. 5% ఉన్నత మధ్యతరగతి కుటుంబాలుగా ఉన్నారు. 86% పేద మధ్య తరగతి కుటుంబాలుగా ఉన్నారు.

అయినప్పటికీ రెడ్డి అంటేనే అదొక హోదాగా, దురహంకారంగా, దుర్మార్గానికి ప్రతీకగా భావిస్తూ సామజిక దాడులు నిర్వహిస్తున్నారు. రెడ్ల చరిత్ర గురించి ఎందుకు మాట్లాడకూడదు..? అది మన హక్కు, రెడ్ల త్యాగాలు పోరాట పటిమ గురించి ఎందుకు రాయకూడదు..? అది మన ధైర్యసహాసాలు. రెడ్లమని ఎందుకు చెప్పుకోకూడదు. పేరు వెనుక రెడ్డి అని ఎందుకు పెట్టుకోకూడదు… అది మన జన్మత: సంక్రమించిన హక్కు

 

రెడ్లందరూ రాజులు కాదు. రెడ్లందరూ దొరలు కాదు. రెడ్లల్లో రాజులు దొరలు ఉన్నారు. అంత మాత్రానికి అందరూ ఆర్థిక స్థితిమంతులా? అదే వాస్తవం అనుకుంటే చరిత్రలో తురకలు, యాదవులు, కుమ్మరులు, గౌడులు రాజ్యపాలన చేశారు. మరి వారు పాలక వర్గాల కింద చేర్చి, స్థితిపరులంటే ఒప్పుతుందా…? మన సమాజం…? మరి ఆ జనాభా మొత్తం స్థితిమంతులే అనుకుంటే సరిపోతుందా?

 

ఒక్క రెడ్ల వర్గం మీదే ఎందుకు సాంఘిక దాడులు అనివార్యం అయ్యాయి? కులం పేరుతో మాట్లాడితే కేసులు అవుతున్న వేళ, కులం సర్టిఫికేట్లు పెట్టి రిజర్వేషన్లు ఎందుకు పొందుతున్నారు…. కులం పేరుతో వేరు చేయడం కులవివక్ష అయితే, అదే కులం సాకుతో మమ్ముల్ని సీట్లు ఇవ్వరు… అదే కులం పేరుతో జాబ్ క్వాలిఫై కావడం లేదు. మరి దీనిని వివక్ష పేరుతో పిలవకూడదా…?

 

సర్వాయి పాపన్న త్యాగధనుడు అని పాట రాసినా, కథనం రాసినా, అంగీకరించే వర్గాలు….. కొండవీటి రెడ్ల గురించి రాస్తే ఎందుకు అంగీకరించడం లేదు. ఆంగ్లేయుల పై స్వాతంత్ర భారతం గురించి పోరాడిన మొట్ట మొదటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి అని ఎందరికి తెలుసు…? వారి దాడులవెనుక దాగిన చారిత్రక కోణాలు ఎందరికి తెలుసు…?

 

కేవలం రెడ్ల పేదరికమే కాదు, రెడ్ల త్యాగాలు ధర్మాలు పాలన గురించి, భావి తరాలకు తెలియ జేయాల్సిన అవసరం ఉంది. ఎవ్వరు స్పందించినా స్పందించక పోయినా రెడ్లను అన్నీ కోణాల్లోంచి నేను వెలికితీస్తాము.

నేను రెడ్ల గురించి రాస్తున్నాము అంటే రెడ్డి గొప్పవాడు అని ఢంకా మోగించడం కాదు. వాస్తవం చెప్పాలంటే నాయకులుగా ఎదిగిన రెడ్లు ప్రజల కోసమే పనిచేస్తున్నారు. ఆ ప్రజల్లో రెడ్లను విస్మరిస్తున్నారు.

 

రెడ్డికి పని చేస్తే, ఇతర వర్గాల ఓటు బ్యాంకు దూరమౌతుందని భయపడుతున్నారు. ఒక రెడ్డి తాను ఎదగడం కోసం సొంత సామాజిక వర్గాన్ని, ఉద్దేశ్య పూర్వకంగా తొక్కి పెడ్తున్నాడు. మరి పేద మధ్య తరగతి రెడ్ల పరిస్థితి ఏమిటీ? చరిత్రలో గమనిస్తే రెడ్ల ఉనికి నాయకురాలు నాగమ్మ దగ్గరనుండి కనిపిస్తుంది. అంతకు పూర్వం కాపులుగా రెడ్ల ప్రస్థానం గ్రామాలను కాపు గాస్తూ కనిపిస్తుంది.

 

తరువాతి కాలంలో కాకతీయ సామంతులు, స్వతంత్ర రెడ్డి రాజులు, కనిపిస్తారు. స్వతంత్ర తొలి సంగ్రామంలో, తెలంగాణ సాయుధ పోరాటంలో రెడ్ల పాత్ర తిరుగులేనిది. ఈ పాలనా దక్షతలో రెడ్లు ప్రజల కోసం మాత్రమే పనిచేశారు అనేది వాస్తవం.

 

ఇవన్నీ చెప్పకూడదా? చెప్పడం లేదా స్మరించుకోవడం దుర్మార్గమా? అహంకారమా? అస్సలే రెడ్ల పరిస్థితి బాగోలేదు. మళ్ళీ రెడ్ల త్యాగాల చరిత్రను చెబితే రెడ్లకి కష్టాలు లేనట్టుగా ఇతరులకు అర్థం అవుతుంది అనడం నిజంగా హాస్యాస్పదం. రెడ్లు ఇప్పటికీ పాలన చేస్తున్నారు. చరిత్ర చెప్పినంత మాత్రాన ఇక్కడ జరిగే నష్టం ఏం లేదు. మొత్తానికి రెడ్లు చాలా వరకు చితికి పోయారు. అయినప్పటికీ ఒక దర్పం మాత్రం మిగిలి ఉంది. దీన్ని అహంకారం అనుకోవడం పొరపాటు.

 

ఇప్పుడు అన్ని వర్గాల్లో పాలకులు, బయలుదేరారు. కాబట్టి ఆ కులాలను కూడా అగ్రకులాల్లో చేర్చాలి. లేదా ఆర్థిక పరిస్థితి ఆధారంగా విభజన చేయాలి. 70 ఏళ్లుగా ఒకే రాజ్యాంగ సూత్రాలు అమలు చేయడానికి కాకుండా 10 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్ పొందుతున్న వర్గాల ప్రగతి, స్థితిగతులను అధ్యయనం చేసి, ఆ తరువాత వర్తింపజేయాలనే అంశాన్ని మరచి, అదే పద్దతిని కొనసాగిస్తూ వస్తున్నా నోరు మెదపని పాలకులకు, అన్ని ప్రభుత్వ పథకాలకు రాయితీలకు నోచుకోని అగ్రవర్ణాలు గుర్తుకు వచ్చేది ఎప్పుడయ్యా అంటే… ఎన్నికలలో ఓట్లు వేయడానికి మాత్రం అగ్రకులాల ముద్ర వేయబడి, సమాజానికి అవసరం లేని పేద, మధ్య తరగతి రెడ్లు లెక్కలోకి వస్తారు.

 

ప్రతి రెడ్డి మరో రెడ్డి ఉన్నతికి సహకరించండి. మరో రెడ్డిని గౌరవించండి. ఈ రోజు మన వాళ్లదాకా వచ్చిన సమస్య, మన దాకా రాదంటారా…? కొంత వినడానికి కఠినంగా అనిపించినా సరే…మన రెడ్డి సామాజిక వర్గంలో ఐఖ్యత తక్కువ. సాటి రెడ్డి బాగుకోరి ఉన్నతికి సహకరించే వారు ఏమో తెలియదు కానీ, . తిరోగమన దిశ. సాయుదపోరటంలో రావినారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల లక్ష్మినరసింహరెడ్డి, భీంరెడ్డి నర్సింహారెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, కమలాదేవి, సాయిరెడ్డి, ఇతర రెడ్లందరూ నాయకత్వం వహించి, నిజాం నియంతృత్వాన్ని ఎదురించారు.