MARGADARSHI

జైల్ అంటే శిక్షాస్థలి అనే భావం నుండి శిక్షణా స్థలి అనేలా, క్షణికావేశంతో తప్పు చేసి, జైలు పాలయ్యేవారు తిరిగి సంఘజీవిగా జనంలో మనుగడ సాగించాలే తప్ప కర్కశ ధోరణితోనో, సంఘ వ్యతిరేకిగానో కాదంటూ మానవీయ పరిపాలనకు బాటలు వేసి, ఖైదీల మార్పుకు శ్రీకారం చుట్టిన మానవతా మూర్తి కొలను వెంకటేశ్వర్ రెడ్డి గారు. ఇలా మారిన మనుషులకు బంధువుగా, వారి కుటుంబాలకు ఆత్మ బంధువుగా నిలిచారు.

శిక్షణాకాలంలోనే 5 బంగారు పతకాలు సాధించిన ఆల్ టైం రికార్డ్, జైళ్ల శాఖలో కీలక మార్పులకు ఆధ్యుడు. ఉద్యమ సారధి కేసీఆర్ స్ఫూర్తితో మలిదశ తెలంగాణ ఉద్యమంలో యూనిఫాం సర్వీస్ జేఏసీ ఏర్పాటు. ఉద్యోగులు, ఖైదీల కుటుంబాల సంక్షేమానికి అవిశ్రాంత కృషి జైళ్ల శాఖకే వన్నె తెచ్చిన నిరంతర శ్రామికుడు. 1999లో ఏపీ జైల్ అధికారుల సంఘానికి అధ్యక్షులుగా ఎన్నికై, నిరాటంకంగా 15 సం||లు తమ సేవలు అందించారు.

 

2009లో అఖిల భారత జైల్ అధికారుల సంఘానికి అధ్యక్షులుగా ఎన్నిక అయ్యారు. ఈ దేశంలో ఉన్న జైల్ సిబ్బంది కోసం వేదిక ఏర్పాటు చేసి, తోటి ఉద్యోగులపై ప్రేమాభిమానాలు చాటుకున్నారు. చర్లపల్లి జైలులో ఆర్గానిక్ ఫామింగ్ ను పరిచయం చేసి, ఖైదీల ఆరోగ్యానికి, సమాజ సేవకు పాటుపడ్డారు.

2010లో ఈయన సలహా మేరకే జైళ్ల శాఖ ఆధ్వర్యంలో పెట్రోలు బంకులు మొదలయ్యాయి. వీటి ద్వారా జైళ్ల శాఖకు ప్రతి రోజు సుమారుగా 10 లక్షల ఆదాయం సమకూరుతుంది. 2010లో జైళ్ల శాఖలో మొదటిసారి ఖైదీలలో ఉన్న కళాత్మకతను వెలికితీస్తూ, వారిచే పేయింటింగ్స్ వేయించి, రవీంద్రభారతిలో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన ఘనత కొలను వెంకటేశ్వర్ రెడ్డి గారి సొంతం.

 

జైళ్ల శాఖ లోగోను రూపొందించడంలో విశేష కృషి చేసిన ఘనత కూడా కొలను వెంకటేశ్వర్ రెడ్డిగారిదే జైళ్ల శాఖలో కానిస్టేబుల్ నుంచి ఐజీ వరకు అందరూ కంప్యూటర్ కోర్సులో నేర్చుకునేందుకు ప్రణాళిక. రెడ్డి హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి, పేద రెడ్డి విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు చేయూతని ఇస్తున్నారు.

 

రెడ్డి బిజినెస్ నెట్ వర్క్ ను నెలకొల్పి, రెడ్డి వ్యాపారవేత్తలకు, నూతన వ్యాపార మార్గాలకు అవసరమైన శిక్షణ, వ్యాపారం వైపు ఆహ్వానిస్తూ యువతకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఆ రెడ్డి గ్రూప్ ఫామింగ్ పేరుతో ప్రకృతి ఒడిలో నివాసయోగ్యమైన స్థలాలను అభివృద్ధి పరచడంతో పాటు ప్రకృతి సిద్ధంగా కాలుష్యరహితమైన వాతావరణంలో గ్రూప్ ఫామింగ్ నెలకొల్పారు.

రెడ్డి జాతిలో సమైఖ్యత, సంక్షేమం గురించి, రెడ్డి జాతి అభివృద్ధికోసం రెడ్డి జాతిని ఒకే వేదికపైకి తెచ్చి రెడ్డి జేఏసీ ఏర్పాటు చేసిన ఘనత మన కొలను వెంకటేశ్వర్ రెడ్డి గారిదే. తమిళనాడులోని వెల్లూరులో శిక్షణ పూర్తిచేసుకునే సమయంలో ఉత్తమ ప్రతిభ కనబరచిన వారికి ఇచ్చే 7 మెడలో 5 మెడల్స్ ఈయనకే దక్కడం విశేషం. ఇప్పటి వరకు ఆ రికార్డ్ ను మరెవరూ సాధించలేక పోయారు.

-వరంగల్, అనంతపురం, మహబూబ్ నగర్, ముషీరాబాద్, చంచల్ గూడాలో డిప్యుటీ జైలర్ గా పనిచేసి 1988లో జైలర్ గా ప్రమోషన్ పొందారు. 2006లో డీయస్పీగా, 2013లో ఎస్పీగా పదోన్నతి పొందారు. చర్లపల్లి సెంట్రల్ జైల్లో పర్యవేక్షణాధికారిగా విధులు నిర్వహిస్తూ జూన్ 2017లో పదవీ విరమణ చేశారు. పదవి విరమణ అనంతరం, రెడ్డి జాతి సంక్షేమం, అభివృద్ధి కొరకు నేను సైతం అంటూ… రెడ్డి బిజినెస్ నెట్ వర్క్ రెడ్డి హెల్ప్ లైన్, రెడ్డి గ్రూప్ ఫామింగ్ మరియు రెడ్డి జేఏసీ ఏర్పాటు చేయడం ద్వారా రెడ్డి జాతి అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఇవేగాక ఉన్నత ఆశయాలకు పేదరికం ఆటంకంగా మారకూడదనే ఉద్దేశంతో ఉచితంగా కాంపిటేటివ్ పరీక్షలకు కోచింగ్, వసతి కల్పించి… ప్రగతి శిఖరాలకు చేర్చారు. రెడ్డి హాస్టల్ లో అక్రమాలను ఎదురుతిరిగి ప్రశ్నించారు. పేద విద్యార్థులకు శిక్షణ, వసతి సదుపాయలతో సహా చూసుకుంటున్నారు.

రెడ్డి హక్కుల కోసం నిరంతరం అలుపెరుగని పోరాటం సాగిస్తున్న రెడ్డి జాగృతి సేవా భావానికి స్పూర్థి ని అందించి, ప్రతీ రెడ్డి బిడ్డ సంక్షేమం కోసం, రెడ్డి హెల్ప్ లైన్ స్థాపించి ఎందరో రెడ్డి బంధువులకు నేనున్నాననే భరోసా కల్పించారు కేవీ రెడ్డి గారు.