రెడ్డి బంధువులకు ముఖ్య గమనిక
రెడ్డి బందువులకు నమస్కారం …
రెడ్డి జాగృతి రెడ్ల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతుంది. రెడ్డిజాతి సంక్షేమం కోసం మూలం నుండి మార్పు రావాలంటే, వ్యవసాయం చేస్తూ అప్పులపాలై, మెడకి ఉరితాడుతో అలంకరించుకుంటున్న మన రైతుల స్థితిగతులను మొదలుకొని, ఉద్యోగం, ఉపాధి అవకాశాలలో ఎలాంటి అవకాశాలు లేక, ఎండమావులై ఊరిస్తూ, చివరకి నిరాశ మధ్య మసులుతున్న యువత వరకు వివిధ స్థాయిలలో మార్పు రావాలి.
దీని కోసం ఏ సేవాసంస్థ వల్లనో, కొంత మొత్తం నిధులతోనో సాధ్యం కాదు. వేల కోట్ల నిధులు అవసరం అవుతాయి , మనము సంక్షేమ సంఘాల తో ఆ లక్ష్యాన్ని సాధించలేము , కావున ఆ నిధులను సాధించుకొనుటకు ఐక్యతతో పోరాడి, ప్రభుత్వం మెడలు వంచైనా సరే సాధించాలి.
ఒక పటిష్టమైన వేదిక ఏర్పాటు కోసం విశాలమైన భావంతోనే, ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతంగా, రెడ్డి హక్కుల సాధన ఉద్యమమే ద్యేయంగా, రెడ్డి రిజర్వేషన్స్ , రెడ్డి కార్పొరేషన్ , సంక్షేమం , హక్కుల సాధనే లక్ష్యం గా, ఎలాంటి స్వార్ధము , లాభాపేక్ష , సంకుచిత భావాలూ లేకుండా పూర్తిగా పార్గదర్శకంగా మన హక్కుల సాధనకోసం, విశ్వవ్యాప్తంగా రెడ్డి ఐక్యత కోసం ఏర్పాటు చేసిన వేదికే రెడ్డి జాగృతి.
రెడ్డి జాగృతి ‘సభ్యులకు నియమ నిబంధనలు :
1. ప్రతీ రెడ్డి బంధువుతో వినయ విధేయతతో , ప్రేమ అభిమానాలతో మెలగాలి.
2. సాటి రెడ్డి బంధువు కు సాద్యమైనంతవరకు అండగా నిలబడే ప్రయత్నం చేయాలి.
3.ఒకరికొకరం సాయంగా అంటే…మన అవసరాలకు తగిన వస్తువులు , ప్రొడక్ట్స్, ఫంక్షన్ హాల్స్ , క్యాటరింగ్ ఇలా… మన అవసరాలకు తగిన ఆర్డర్స్ మన దగ్గరలో ఉన్న రెడ్డి బంధువులకు ఇవ్వడం ద్వారా తోడ్పాటు అందిద్దాం.
4. మీకు ఏదైనా సాయం చేయగల అవకాశం ఉంటే మన వాళ్లకి సాయం చేద్దాం…మీ స్కూల్స్ కాలేజీ లలో చదువులో ముందుండి , చదవలేని పేద విద్యార్ధులకి, రాయితీ , ఫీజు మాఫీ ఇలా… చేయడానికి ముందుకు రండి.
5.మనం ఇతర వర్గాలతో కలిసి పని చేద్దాం, ఆదరిద్దాం… గౌరవిద్దాం … మన రెడ్ల ఆత్మగౌరవానికి భంగం వాటిల్లన్నంత వరకు..
రెడ్డి జాగృతి సభ్యత్వ రుసుము :
3౦౦/- (మూడు వందల రూపాయలు) గా కమిటీ నిర్ణయం చేయడమైనది.
మీరు ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే…
1. ప్రమాదవశాత్తు ఏదైనా అంగవైకల్యం కలిగితే 2 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా
2. మరణం సంభవిస్తే 2 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా, జీవిత భీమా వర్తింపు